10 కేజీల వినాయక లడ్డును 1,51,116ల కు వేలం పాట పాడి దక్కించుకున్న పిడుగు సాయి రేఖ
రైల్వేకోడూరు ప్రజాసీమ
తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు స్థానిక వైఎస్ఆర్ కార్యాలయం దగ్గర సీతారామ నగర్ నందు శ్రీశ్రీశ్రీ గణేష్ (వినాయక చవితి)ఉత్సవాలలో భాగంగా వినాయక 10కేజీల లడ్డు వేలoపాట అత్యధికంగా 1,51,116 -00 (ఒక లక్ష యాబై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు )వేలం పాట లో వినాయకుని లడ్డును పిడుగు వెంకటేష్,పిడుగు సునీతల కుమార్తె పిడుగు సాయి రేఖ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బత్యాల శివకుమార్ కుటుంబ సభ్యులు, బత్యాల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, సింహాసనం బాలాజీ కుటుంబ సభ్యులు, సీతారామ నగర్ లో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు.