prajaseema.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 5:51 pm Digital Edition : PRAJA SEEMA

హెడ్ కానిస్టేబుల్‌గా వీరపోగు వెంకటయ్యకు పదోన్నతి

హెడ్ కానిస్టేబుల్‌గా వీరపోగు వెంకటయ్యకు పదోన్నతి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వీరపోగు వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు.

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో చూపిన సేవలను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి లభించడం పట్ల సహచర పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వెంకటయ్యకు పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. పదోన్నతితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.