prajaseema.com
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 5:22 pm Digital Edition : PRAJA SEEMA DESK

హెచ్ఎంఎం హై స్కూల్ కరస్పాండెంట్ దేవ సుందరంను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు

రైల్వే కోడూరు మండలం స్థానిక హెచ్ఎంఎం హై స్కూల్ కరస్పాండెంట్ దేవ సుందరంను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు

రైల్వేకోడూరు స్థానిక హెచ్ఎం హైస్కూల్లో కరస్పాండెంట్ గా పనిచేస్తున్న దేవ సుందరం 12. 02.2026 వ తేదీన స్కూలు నుండి ఇద్దరు పిల్లలను ఇంటి పనుల నిమిత్తం ఇంటికి తీసుకెళ్లి పని సరిగ్గా చేయలేదని పిల్లలను విపరీతంగా కొట్టడం జరిగినది ఈ ఇద్దరు పిల్లలు ఒకరికి ఫిట్స్ రావడంతో ఆ అబ్బాయి ని హాస్పిటల్లో చేర్పించి తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేయడం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు గత నాలుగు నెలలుగా విచారణ చేయాలని కలెక్టర్ దృష్టికి మరియు డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా నాలుగున్నర నెల తర్వాత దేవ సుందరం అనే వ్యక్తిని కలెక్టర్ ఉత్తర్వులు మేరకు సస్పెండ్ చేయడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మరియు ఎస్ ఎఫ్ ఐ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.