నందలూరు-(ప్రజాసీమ)
సొంత గ్రామంలో అంగరంగ వైభవంగా
రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు శ్రీరామనవమి వేడుకలకు నిర్వహించారు.కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, ఎగువ కుమ్మరపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.”శ్రీ సీతారాముడి కల్యాణోత్సవం” వేడుకలు భక్తుల హృదయాలను ఆనందంతో నింపాయి. పుష్పాలతో అలంకరించిన దేవాలయం శోభాయమానంగా కనిపించింది . చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని, శ్రీరాముని ఆశీస్సులు పొందారు.తదుపరి యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో భక్తులందరికీ “అన్న ప్రసాద కార్యక్రమం” నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.