prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 6:54 pm Digital Edition : PRAJA SEEMA DESK

సమాచారం మీ హక్కు, దాని వినియోగించుకోండి; అడ్వకేట్ సాయి ప్రతాప్

అమరావతి (ప్రజా సీమ)

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం పనితీరుపై ప్రశ్నించే హక్కు ఉంది. ఈ హక్కును చట్టబద్ధంగా వినియోగించుకునే సాధనం సమాచార హక్కు చట్టం (RTI). ఇది సాధారణ ప్రజలకు అధికారులపై పర్యవేక్షణ చేసే శక్తిని ఇస్తుందనీ హైకోర్టు అడ్వకేట్ సాయి ప్రతాప్ తెలియజేశారు.ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆలస్యం, నిర్లక్ష్యం, మరియు అవినీతి వంటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో భూమి రికార్డులు, సర్వే నంబర్లు, 1-బి రిజిస్టర్లు, ఎఫ్ఎంబి స్కెచ్‌లు, ప్రభుత్వ భూముల వివరాలు వంటి అంశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ,ఈ సమస్యలకు ఆర్టిఐ ఒక సమర్థమైన పరిష్కారమని. సరైన విధంగా RTI దాఖలు చేస్తే, 30 రోజుల్లో సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ సమాచారం ఆధారంగా అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయం పొందవచ్చు అని తెలియజేశారు.అనేక సందర్భాల్లో RTI ద్వారా సేకరించిన సమాచారం కోర్టులో బలమైన ఆధారంగా నిలుస్తోంది. ముఖ్యంగా భూమి వివాదాలు, అక్రమ ఆక్రమణలు, మరియు ప్రభుత్వ అధికారుల దుర్వినియోగం వంటి కేసుల్లో RTI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ప్రజలు ఒక విషయం గుర్తుంచుకోవాలి — “సమాచారం ఉన్నవాడే బలవంతుడు”. కాబట్టి మీ హక్కులు కాపాడుకోవడానికి RTIను సమర్థవంతంగా వినియోగించుకోవాలనీ K. సాయిప్రతాప్
అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలియజేశారు.
Cell: 7310810845