prajaseema.com
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 1:37 pm Digital Edition : PRAJA SEEMA

సమన్వయంలో విస్మరిస్తే ఇక అంతే సంగతులు,, చలో విజయవాడ కి సీనియర్ తమ్ముళ్ళ ప్రణాళికలు

అమరావతి

రైల్వే కోడూరు సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తే చలో విజయవాడ ప్రణాళికలు సిద్ధం చేసి తాడోపేడో తేల్చుకునేందుకు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రైల్వే కోడూరు సమన్వయ సమావేశాన్ని పక్కా ప్రణాళికల ప్రకారం కొందరితో మాత్రమే నిర్వహిస్తే, ఇక ఎన్నో ఏళ్లుగా టిడిపిని నమ్ముకుని టిడిపితో కలిసి పనిచేస్తున్న సీనియర్లు తమ ప్రణాళికలు సిద్ధం చేసేలా ఆలోచన చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రైల్వేకోడూరు నియోజకవర్గంలో కొన్ని మండలాలలో టిడిపి నాయకుల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. ఇప్పుడు సమన్వయ కమిటీలో మీరు ఇరువురు నీ సమన్వయపరిచి స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు అటు జోనల్ కోఆర్డినేటర్, ఇటు అబ్జర్వర్ పనిచేయాల్సి ఉంటుంది. అలాకాకుండా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితి చేజారే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న కొంతమంది మరింత అసంతృప్తికి లోనై పార్టీతోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. మరి రైల్వే కోడూరు సమన్వయ కమిటీ సమావేశం టిడిపిలో వర్గ విభేదాలను తొలగిస్తుందో లేక మరింత ఆజ్యం పోసి టిడిపిని ఇబ్బంది పెట్టేలా తయారవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈసారి జరిగే సమన్వయ కమిటీ సమావేశం తర్వాత రైల్వే కోడూరు టిడిపిలో ఏకంగా పరిస్థితులు మారనున్నాయి సమాచారం.