prajaseema.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 10:53 pm Digital Edition : PRAJA SEEMA

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి

సిద్ధవటం, ప్రజా సీమ

శ్రీ జగజ్జనని రేణుక ఎల్లమాంబ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ జగజ్జీని రేణుక ఎల్లమాంబ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి పుత్త నరసింహారెడ్డి దర్శించుకున్నారు ఆయనకు ఆలయ సంప్రదాయాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి రైతు పంటలు దిగుబడి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందంటూ తెలిపారు కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాబోయే స్థానిక ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు