prajaseema.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:45 pm Digital Edition : PRAJA SEEMA

శ్రీ భుజంగేశ్వర ఆలయంలో సకాలంలో వర్షాలు పడాలని వరుణ యాగం

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక వైదిక పూజలు
రైల్వేకోడూరు సీమ
రైతు క్షేమం.. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా.. వరుణ దేవుడిని ప్రార్థిస్తూ రైల్వే కోడూరు శ్రీ భుజంగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం వంటి ప్రత్యేక వైదిక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ పవిత్ర పూజా కార్యక్రమాల్లో  రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్ కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , సతీమణి ముక్కా వరలక్ష్మి ,యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాడి పంటలు పుష్కలంగా పండాలి.. రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి.. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని శ్రీ భుజంగేశ్వర స్వామివారిని భక్తిపూర్వకంగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర , చెర్మన్ జయప్రకాశ్  కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు