prajaseema.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 4:19 pm Digital Edition : PRAJA SEEMA

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో టీటీడీ బోర్డు మెంబర్ వైద్యం శాంతరాం

శ్రీకాళహస్తి నేటిపత్రిక ప్రజాసీమ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు వైద్యం శాంతారాం దంపతులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు.వారికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి స్వాగతం పలికారు.అనంతరం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, పాలకమండలి సభ్యులు కొప్పర్ల నాగరాజు, తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,శ్రీకాళహస్తి నాయి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.