prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 3:02 pm Digital Edition : PRAJA SEEMA DESK

వీఆర్వో గంగన్న మృతి

ప్రగాఢ సానుభూతి తెలిపిన రెవిన్యూ యంత్రాంగం

సిద్ధవటం ఫిబ్రవరి 11 నేటిపత్రిక ప్రజాసీమ: గత కొంతకాలంగా అనారోగ్యాలతో బాధపడుతూ బుధవారం మృతి చెందడంతో మండల తాసిల్దార్ ఆకుల తిరుమల బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు మండలంలోని జ్యోతి గ్రామ సచివాలయ పరిధిలో వీఆర్వో గా విధులు నిర్వహిస్తున్న గంగన్న అనారోగ్యాల కారణాలవల్ల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మండల తాసిల్దార్ ఆకుల తిరుమల బాబు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మండల ఆర్ ఐ ప్రసాద్ బాబు మాట్లాడుతూ జ్యోతి విఆర్ఓ గా విధులు నిర్వహిస్తూ గత కొన్ని నెలలుగా అనారోగ్యాలతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన విఆర్వో గంగన్న మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు రెవిన్యూ యంత్రాంగం తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.