విస్టమ్ హైస్కూల్లో ఘనంగా పాఠశాల లీడర్ల ప్రమాణ స్వీకారోత్సవం
రైల్వేకోడూరు న్యూస్:
రైల్వేకోడూరు కొత్తబజార్ స్థానిక విస్టమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూ ల్లో లో పాఠశాల నూతన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గత వారం పాఠశాలలో పార్లమెంటరీ విధానంలో నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఈరోజు అధికారికంగా బ్యాడ్జీలు ప్రదానం చేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కోడూరు డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ బి.పి. గురువయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు బ్యాడ్జీలను బహూకరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యతలతో మెలుగుతూ ఉత్తమ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నామినేషన్ల ప్రక్రియ, ఓటు హక్కు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవడంపై విద్యార్థు లకు ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకే ఈ ఎన్నికలు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాం డెంట్ డాక్టర్ టి. ప్రదీప్, అడ్మిన్ డైరెక్టర్ టి మదన్ మోహన్, ప్రిన్సిపాల్ టి ప్రియాంక, అకడమిక్ ఇన్ఛార్జ్ పి ముఖేష్ ఉపాధ్యాయులు మొదలగు వారు పాల్గొన్నారు.