prajaseema.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 12:08 pm Digital Edition : PRAJA SEEMA DESK

విభిన్న ప్రతిభావంతుల సన్మాన సభ

-స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు

సిద్ధవటం ఫిబ్రవరి 17 ప్రజాసీమ: రాయచోటి నియోజకవర్గం, రాయచోటి తాలూకా లో ఉండే దూదేకుల సంక్షేమ సంఘం మరియు దూదేకుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నూతనంగా ఉద్యోగంలో ప్రవేశిస్తున్న గ్రూప్ 1 & గ్రూప్ 2 అభ్యర్థులు లను, అదే విధంగా 2025 లో డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని మరియు రాజకీయ పదవులు పొందిన వారిని, దూదేకుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిథులుగా స్టేట్ నూర్ భాషా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు గారు, స్టేట్ దూదేకుల సంఘం అధ్యక్షులు నాగూర్ వలి గారు (మదనపల్లె ఆర్టిసి డిపో గౌరవ అధ్యక్షులు) పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తఫా గారు, మనసూర్ గారు, సాయి లీల గారు, పాలగిరి షర్మిల గారికి అదేవిధంగా పిడి ఇంకా చాలామంది ఉపాధ్యాయులకు సన్మాన గ్రహీతలకు సన్మానం చేయడం జరిగింది . ఈ సన్మాన కార్యక్రమానికి మదనపల్లి, కడప, రాజంపేట నుంచి నూర్భాషీయులు రావడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు గారు మాట్లాడుతూ నూర్భాషీయుల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మనకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటే విధంగా అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మహిళా అధ్యక్షురాలు రెడ్డి బూ గారికి, జిల్లా కార్యదర్శి రహిమాన్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పగిడిపల్లి పక్కీర్ సాహెబ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి వారు మరింత అభివృద్ధిలోకి వస్తూ మన నూరు బాషీయుల కుటుంబీకులకు ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకున్నారు.