వాల్మీకిపురం,;
వాల్మీకిపురం సమీపంలోని మంచూరు గ్రామంలో దొంగతనం ఘటన చోటుచేసుకుంది. చంద్రమ్మ అనే మహిళ పొలంలో పని చేస్తుండగా, చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెను మోసం చేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న తాళిబొట్టును లాక్కొని, ముందే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పరారయ్యాడు.ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.