prajaseema.com
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 4:35 pm Digital Edition : PRAJA SEEMA

రైల్వేకోడూరు లో 210 మందికి గంజాయి పరీక్షలు

రైల్వేకోడూరు టౌన్‌లో 210 మందికి గంజాయి పరీక్షలు

రైల్వేకోడూరు ప్రజాసేమ

తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు టౌన్‌లో గంజాయి వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిట్వేల్ రోడ్‌లోని హాస్పిటల్ సమీపంలో గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగించి మొత్తం 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించడం జరిగింది.అలాగే, గంజాయి వినియోగం మరియు విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసు సమాచారదారుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు మరియు వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. అలాగ సమాచారం అందించిన వారి వివరాలు చాలా గోప్యం గా ఉంచబడతాయని తెలిపారు.అదేవిదంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ తరఫున నిరంతరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.