prajaseema.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 7:25 pm Digital Edition : PRAJA SEEMA

రైతుల సంక్షేమం..వ్యవసాయ అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం -రైతన్నా! మీకోసం కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

రామాపురం మార్చి 16(ప్రజా సీమ  ప్రతినిధి)

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం,నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన “రైతన్నా! మీకోసం” కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులను కలిసి అన్నదాత సుఖీభవ పథకం కింద అందుతున్న నిధుల గురించి ఆరా తీశారు.
రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
రైతుల ఆదాయం పెంచేందుకు మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.