prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:26 am Digital Edition : PRAJA SEEMA DESK

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం

సిద్ధవటం మార్చి 24: సిద్దవటం మండలం మాధవరం గ్రామపంచాయతీలో
రైతన్న మీకోసం – ఇంటింటికి కార్యక్రమానికి హాజరైన స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజవర్గ ఇంచార్జి శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ఆదేశాలు మేరకు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉంది స్టేట్ డైరెక్టర్ డాక్టరు నాగూరు వీరభద్రుడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సిద్దవటం మండలం, మాధవరం-1 గ్రామం లో బూత్ నెంబర్ 32 నందు పర్యటిస్తూ “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ” రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతుల ఇండ్ల వద్దకే వెళ్లి డాక్టర్ నాగూరు వీరభద్రుడు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగూరు వీరభద్రుడు మాట్లాడుతూ రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం రైతులు చేపడుతున్న వ్యవసాయ పనులపై కూడా డాక్టర్ నాగూరు వీరభద్రుడు ఆరా తీశారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పెగడ హరి ప్రసాద్, మావిళ్ళ మురళి, కరమళ్ళ భాష, శంకర్ రెడ్డి, చేపూరి నర్సింలు, కమా ల్ బి,సచివాలయం సిబ్బంది అగ్రికల్చర్ అసిస్టెంట్ మౌనిక రెడ్డి పాల్గొన్నారు.