prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 5:33 pm Digital Edition : PRAJA SEEMA

రైటు ఎక్కే ప్రయత్నంలో విద్యార్థికి తీవ్ర గాయాలు

ఓబులవారిపల్లి (ప్రజా సీమ)

ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ్య ప్రమాదవశాత్తు రైలు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి రైలు కిందపడ్డ అతడిని సురక్షితంగా బయటికి తీశారు. అయితే అప్పటికే అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.గాయపడిన విద్యార్థిని హుటాహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. అధికారులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.