prajaseema.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 1:04 pm Digital Edition : PRAJA SEEMA

రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

రైల్వే కోడూరు మండలం బొజ్జోరిపల్లి బి. ఒడ్డిపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

రైల్వే కోడూరు ప్రజా సీమ

ఈ సదర్భంగా *రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* జాతర మహోత్సవానికి హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు.

 

జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు *యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి* ఘన స్వాగతం పలికారు.

 

భక్తి, సంప్రదాయం, గ్రామీణ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ జాతర మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.