రాజంపేట పట్టణం-(ప్రజా సీమ)
కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ నందు రాజంపేట శాసనసభ్యులు , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , గుంతకల్లు రైల్వే డిఆర్సిసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి కలిసి రైల్వే స్టేషన్ ను గురువారం సందర్శించారు.రాజంపేట రైల్వే స్టేషన్ నందు జరిగిన అమృత్ భారత్ పనులను పర్యవేక్షించడానికి, పనులు పురోగతి తెలుసుకోవడానికి ప్రయాణికుల అవసరాల కోసం ఏ సౌకర్యాలు ఉంటే బాగుంటుందో రైల్వే అధికారుల నుంచి సమాచారం సేకరించి ఆ విధంగా రాజంపేట రైల్వేస్టేషన్లో ఆ సౌకర్యాలని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాజంపేట రైల్వేస్టేషన్లో పార్సిల్ ఆఫీస్, రెండు ఎక్సలేటర్ లిఫ్ట్లు, ప్రయాణికుల సౌకర్యార్థం మరో ఫుటౌట్ బ్రిడ్జి, రెండో నెంబర్ ప్లాట్ఫారంలో టాయిలెట్లు , ప్లాట్ ఫామ్ షెల్టర్,రైల్వే అండర్ బ్రిడ్జి నందు మున్సిపల్ పైప్లైన్ డైవర్షన్ మరియు రైల్వేకు అంతరాయంగా ఉన్న కేబుల్ లను తొలగించి త్వరితగతిన పూర్తయ్యేలా రైల్వే అధికారులతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీసీ జనార్ధన్, పాపినేని విశ్వనాథరెడ్డి సుబ్బరామరాజు, తిప్పన నాగభూషణం,ఆర్పిఎఫ్ ఎస్సై త్రివేణి, స్టేషన్ మాస్టర్ గోపి, దండు గోపి, కళ్యాణ్ రెడ్డి , అమర్, శివశంకర్, చికెన్ శీను తదితరులు పాల్గొన్నారు.