prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 10:06 pm Digital Edition : PRAJA SEEMA DESK

రాజంపేట నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు; రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

రాజంపేట పట్టణం-(ప్రజా సీమ)

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురుషోత్తముడైన శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, త్యాగం, సేవ అనే విలువలను శ్రీరాముడు మనకు బోధించారని, నేటి సమాజంలో ఆ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు, అభిమానులకు ఆ శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ శ్రీరామనవమి ప్రతి ఇంటా శాంతి, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని, రాజంపేట నియోజకవర్గం ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలో జరిగే శ్రీరాముల వారి ఉత్సవాలను ప్రతి ఒక్కరు చూసి తరించి పునీతులు కావాలని  చమర్తి ఆకాంక్షించారు.