రాఘవేంద్ర స్టూడియో 26వ వార్షికోత్సవ వేడుకలు
రైల్వేకోడూరు ప్రజాసేమ
రైల్వేకోడూరు: ఫొటోగ్రఫీ రంగంలో 26 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న శ్రీ రాఘవేంద్ర స్టూడియో 26వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టూడియో నిర్వాహకులు హెవీ రమణ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా తమపై నమ్మకం ఉంచి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఫొటోగ్రఫీ, వీడియో రంగాల్లో నాణ్యమైన సేవలను అందిస్తూ భవిష్యత్తులోనూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తమను ప్రోత్సహించిన కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో స్టూడియో సిబ్బంది, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.