prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 1:59 pm Digital Edition : PRAJA SEEMA DESK

రహదారులపై అక్రమ ఆక్రమణల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 

రైల్వే కోడూరు పట్టణంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను ఆక్రమణల నుంచి విముక్తం చేయడం లక్ష్యంగా, కోడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్, కోడూరు సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రహదారికి ఇరువైపులా ఆక్రమించి నిలిపిన తోపుడు బండ్లు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించారు. అలాగే, రహదారులపై అక్రమ ఆక్రమణలు చేయకుండా ఉండాలని వ్యాపారులు, తోపుడు బండి యజమానులు మరియు వాహనదారులకు సూచనలు చేశారు.
ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని, రహదారులను ఆక్రమించరాదని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా రహదారులను ఆక్రమించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.