గాలివీడు మార్చి 20(ప్రజా సీమ విలేకరి)
ముస్లిం మైనారిటీల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకొని మాజీ సర్పంచ్ ఆలియా భాను ఆధ్వర్యం లొ బోరెడ్డి గారి పల్లి పంచాయతీ లో చీరలు పంపిణీ చేశారు. శుక్రవారం గాలి వీడు మండలం లోని సుగాలి తాండా,బోరెడ్డి గారి పల్లి,బక్కిరెడ్డి గారి పల్లి,గొందిపల్లి లలోని అన్ని కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు.దాదాపు పది సంవత్సరాలు గా వారి తండ్రి దివంగత పక్కిర్ సాబ్ కోరిక మేరకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మన్సూర్ ,వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.