రంగనాయకులపేట అంగన్వాడీ 2లో ఉత్సవాలు
రైల్వేకోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం లో మహిళా శిశు సంక్షేమ శాఖ రైల్వేకోడూరు ఐ సి డి ఎస్ ప్రొజెక్ట్ సిడిపిఓ యస్ రేణుక ఆధ్వర్యంలో స్థానిక రంగనాయకులపేట అంగన్వాడీ 2 కేంద్రము నందు ఘనంగా ఉత్సవాలు నిర్బహించారు. ఈ సందర్బంగా రైల్వే కోడూరు సెక్టార్ సూపర్వైజర్ వై.నిర్మలాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార సేవల ప్రాధాన్యతను వివరించారు. పిల్లల ఎదుగుదల, ఎత్తు, బరువు ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గుడ్లు, పాలు, బాల సంజీవిని కిట్స్, బియ్యం, పప్పులు, నూనె, బలామృతం వంటి పౌష్టికాహార పదార్థాలను అర్హులైన లబ్దిదారులు ప్రతిరోజూ తీసుకోవాలని సూచించారు. అలాగే ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పోషకాహార లోపాలను నివారించవచ్చని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి సెంటర్లో అన్నప్రాసన కూడా చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు సీడీపీఓ రేణుక దేవి, సూపర్ వైజర్ నిర్మల దేవి ,అంగన్వాడీ కార్యకర్త సునీత ,సహాయకురాలు రమాదేవి ,ఆశ కార్యకర్తలు రామలక్ష్మి ,సుహాసిని ఆరోగ్య,కార్యకర్త సుజాత ,అంగన్వాడీ పరిధిలో గర్భిణీ బాలింతలు పిల్లల తల్లులు ప్రీ స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులు మొదలగువారు పాల్గొనడం జరిగినది.