prajaseema.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 12:32 pm Digital Edition : PRAJA SEEMA

మైనర్ బాలికపై నేరానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్ – జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

మైనర్ బాలికపై నేరానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్ – జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
రైల్వేకోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన నేరానికి సంబంధించి నమోదు చేసిన కేసులో నిందితుడైన చీరాల రమేష్ బాబు ను రేణిగుంట డిఎస్పి వై. శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు.కేసు దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించి, నిందితుడి ప్రమేయంపై విచారణ చేపట్టిన అనంతరం 03.10.2026 తేదీన నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య పరీక్షలు మరియు ఇతర విధి విధానాలను పూర్తి చేసి, తదుపరి జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ఈ దినం గౌరవనీయులైన మేజిస్ట్రేట్, కోడూరు వారి ఎదుట హాజరుపరచడం జరిగింది.మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో, బాధిత బాలిక గుర్తింపు, వ్యక్తిగత వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలను బహిర్గతం చేయడం లేదు. బాలికకు సంబంధించిన వివరాల గోప్యతను కాపాడుతూ, చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కేసులో సాక్ష్యాధారాలను శాస్త్రీయంగా సేకరించి, దర్యాప్తును నిష్పక్షపాతంగా మరియు వేగవంతంగా పూర్తి చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి.
రైల్వే కోడూరు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి: మైనర్ బాలికకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు లేదా గుర్తింపును సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా సహకరించాలి. బాధితురాలి గోప్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.