prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:41 am Digital Edition : PRAJA SEEMA DESK

మార్కాపురం బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

 

అమరావతి (ప్రజా సీమ)

మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం తెలుసుకున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.