prajaseema.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 11:34 am Digital Edition : PRAJA SEEMA DESK

మహిళల రక్షణకు శక్తి యాప్, విద్యార్థులకు అవగాహన సదస్సు

కడప మార్చి 9(ప్రజా సీమ క్రైమ్ రిపోర్ట ర్)కడప జిల్లా ఎస్ పి, డీస్ పి,మహిళా పోలీస్ స్టేషన్, ఎస్ ఐ సుభాష్ చంద్ర బోస్,ఆదేశాల మేరకు సోమవారం కడప నగరం లోని జిఎంఆర్ స్కూల్ నందు, విద్యార్థినీ విద్యార్థులకు బాలిక లపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, డయల్ 112, 1930 & 1098 వంటి టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి, శక్తి యాప్ ల ఆవశ్యకత గురించి మరియు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరి గింది. ఇందులో కడప సబ్ డివిజన్ శక్తి టీమ్ హెడ్ కాన్స్టేబుల్ శివశంకర్ రెడ్డి, కాన్స్టేబుల్ రాజా రెడ్డి, మహిళా పోలీస్ లు ధనలక్ష్మి మరియు బేబీ షామిని లు పాల్గొ న్నారు.