మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి సిగి చెన్నయ్య, రాష్ట్ర కార్యదర్శి,
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాంజీ గాంజీ పథకాన్ని పూర్తిగా రద్దుచేసి అదే స్థానంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కూలీల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిగి చెన్నయ్య. మరియు ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిలర్ యూనియన్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాము. ఈ సందర్భంగా వారు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేట, రాఘవపురం పంచాయతీలలో పర్యటించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధముగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఇది సరైనది కాదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి పరచడం కోసం 2005లో ఆనాటి ప్రభుత్వం వామపక్ష పార్టీల ప్రోత్బలంతో మహాత్మా గాంధీ పేరు మీద ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఆదాయాన్ని చేకూర్చడం కోసం ఈ పథకానికి రాంజీ గాంజి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కూలీలకు పనిగంటలకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలని, అందులో భాగంగా కూలీలకు కావలసిన పనిముట్లనే ప్రభుత్వమే సరఫరా చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటి పథకాలను కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఉపాధి హామీ కూలీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.