prajaseema.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 9:50 am Digital Edition : PRAJA SEEMA DESK

మండెం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

చిన్నమండెం మార్చి 20:
అన్నమయ్య జిల్లా,చిన్నమండెం మండలం,దేవగుడిపల్లి గ్రామ పరిధిలోని జిల్లావాండ్లపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ మండెం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి, కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు.పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అలాగే, ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.భక్తుల రాకపోకలు పెరిగే దృష్ట్యా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.