prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 9:52 pm Digital Edition : PRAJA SEEMA DESK

బి కొత్తకోట సిఐ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

మదనపల్లె -( ప్రజా సీమ)

ఏడేళ్ళుగా ప్రేమించుకున్నాం. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నాం. అమ్మాయి వర్గం మిస్సింగ్ అంటూ బి.కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంరోజుల తర్వాత అనగా బుధవారం రాత్రి ఇరువురు కలసి బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్ సీఐ వద్దకు వెళ్ళడం జరిగింది. ఇరువర్గాలతో ఏలాంటి విచారణ చేయకుండా.. నా భార్య ను సీఐ వారి తల్లిదండ్రులు అప్పగించి.. వెంటపెట్టి పంపించేశారు. ఇదేమని అడిగితే.. ఎక్కువ మాట్లాడితే కేసులు బుక్ చేసి జైల్లో పెడుతానంటూ బి.కొత్తకోట సీఐ దౌర్జన్యం, బెదిరింపులకు గురిచేశారు. నా భార్యను నాకు అప్పగించాలని అడిగితే.. పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచీ బయటకు పంపించేశారని.. బాధితుడు గురువారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ బూడిదగడ్డపల్లికి చెందిన ముక్కండ్ల ఉత్తన్న చిన్న కుమారుడు వినోద్‌కుమార్ ఇంటర్‌ వరకు చదువుకొని మోల్డింగ్ కమ్మి బెండింగ్ పనులు చేసుకుంటున్నాడు. బి.కొత్తకోట మండలంలో ఇంటర్ చదువుతున్న సమయంలో.. బి.కొత్తకొట మండలం సూరపువారిపల్లి పంచాయతీ దయ్యాలచారిపల్లికి చెందిన అమ్మాయితో పరిచయమైంది. గత ఏడేళ్ళుగా ఇరువురు ప్రేమించు కుంటున్నాము. కులాలు వేరు కావడంతో హారిక తల్లిదండ్రుల అభ్యంతరం చేశారు. ఏడాది కితమే  ఇంటి‌నుంచీ వెళ్ళి పోయారు. అందరి సమక్షంలో పెళ్ళి చేస్తామని హామీ ఇచ్చి వేరు చేశారు. అయితే యువతి కు పెళ్ళి సంబంధాలు చూస్తుండటంతో గత నెల 25న ఇద్దరు ఇంటి నుంచీ వెళ్ళిపోగా.. మరలా పిలిపించి పోలీసులు, పెద్దలు కలసి పంచాయతీ చేశారు. అయితే పదిరోజుల కితం ప్రేమికులు ఇరువురూ.. ఇంటినుంచీ వెళ్ళిపోయి.. ఒరిస్సాలో పేట గ్రామంలోని అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వారంరోజుల తర్వాత హారిక మొబైల్ లొకేష్ ఆధారంగా బి.కొత్తకోట పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషనుకు రమ్మన్నారు. నిన్నటిరోజు అనగా బుధవారం రాత్రి 7.30గంటలకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్‌ము చేరుకున్నారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు. అయినా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్యను  ఏలాంటి విచారణ చేయకుండానే సీఐ వారి తల్లిదండ్రులకు అప్పగించి పంపించి వేయడంపై అబ్బాయి తరపున బంధువులు సీఐని నిలదీశారు. ఎవరైనా మాట్లాడితే కేసులు నమోదు చేస్తామని సీఐ బెదిరింపులు చేస్తూ.. బయటకు పంపించేశారంటూ బాధితుని బంధువులు, కుటుంబసభ్యులు సీఐపై తిరుగు బావుటా చేశారు. బాధితుడు  నా భార్యను నాకు అప్పగించి సీఐపై చర్యలు తీసుకోవాలని గురువారం మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట సీఐపై విచారణకు ఆదేశిస్తూ.. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి అడిషనల్ ఎస్పీకి ఆదేశించారు.