prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:48 pm Digital Edition : PRAJA SEEMA DESK

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తల పవన్ నియామకం

కడప,ఫిబ్రవరి 26 ప్రజాసీమ:- ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో నూతనంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తల పవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆది నారాయణ రెడ్డి,కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బత్తుల పవన్ కుమార్ ను పలువురు కలిసి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు