prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:09 pm Digital Edition : PRAJA SEEMA DESK

బాధితులకు న్యాయం చేస్తూనే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం; చమర్తి జగన్మోహన్ రాజు

రాజంపేట పట్టణం(ప్రజా సీమ)

రాజంపేట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్  చమర్తి జగన్ మోహన్ రాజు  తెలియజేశారు.బుధవారం నాడు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రెవిన్యూ,ఆర్ అండ్ బీ రైల్వే,మున్సిపల్ అధికారులతో పాటు అండర్ బ్రిడ్జి వలన నష్టపోయే గృహ మరియు దుకాణదారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రాజంపేటకు రైల్వే అండర్ బ్రిడ్జి ఎంతో ముఖ్యమని,అలాగే నష్టపోయే బాధితులను ఆదుకోవడం కూడా తమకు చాలా ముఖ్యమని,కాబట్టి నష్టపోయే ఇలా యజమానులకు నష్టపరిహారం అందిస్తూనే దుకాణదారులకు మున్సిపల్ పరిధిలోని స్థలాలలో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు,అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అందరికీ న్యాయం చేస్తామని చమర్తి జగన్ మోహన్ రాజు  భరోసానిచ్చారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భావన ఐఏఎస్  మాట్లాడుతూ వెంటనే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన ఎస్టిమేట్లు,అలాగే నష్టపోయే వారి జాబితాను తయారుచేసి వారికి అందించే నష్టపరిహారం వివరాలను,విధి విధానాలను తయారుచేసి నివేదికను అందజేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఆర్ యు బి బాధితులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.