సిద్ధవటం(ప్రజా సీమ):ఎక్కడైనా దేవుని దర్శనం తర్వాత ప్రసాదం తినడం అలవాటు.కానీ సిద్ధవటం మండలంలో ఒక కార్యాలయంలో మాత్రం ప్రసాదం ముందు తిని తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి.ప్రతి ఒక్కరు ఏ పని కావాలన్నా ఈ ప్రసాదం కొనుగోలు చేయవలసిందే. ఈ ప్రసాదం కొనుగోలు చెయ్యకపోతే స్వామి వారి దర్శనం కూడా జరగదు.ఇలా అనేక మంది ప్రజలను ప్రసాదం పేరుతో ఆ కార్యాలయంలో దోపిడి మితిమీరి పోతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ కార్యాలయంలో ప్రసాదం రుచి తక్కువ రేటు ఎక్కువ అనే చందంగా పరిస్థితి తయారయింది అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ప్రసాదం మరియు ఆయన స్వామికి ఇక్కడ కొంతమంది నాయకుల మద్దతు ఉండడం,వారు చెప్పినట్లు వీరు వ్యవహరిస్తూ ఉండడం తో ప్రసాదం రేటు రోజు రోజు కి పెరిగిపోతుంది.అతి త్వరలో ఈ ప్రసాదం కి అవినీతి నిరోధక శాఖ షాక్ తప్పదనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి.