– న్యాయవాదుల ఓట్లు 114 పోలైన ఓట్లు 107
రాయచోటి ఫిబ్రవరి 13(నేటిపత్రిక ప్రజాసీమ): ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కోసం ఎన్నుకోవాల్సిన 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల కోసం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలు రాయచోటి బార్ అసోసియేషన్ లో ప్రశాంతంగా ముగిసాయి. రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికల కోసం పోలింగ్ అధికారిగా పి రెడ్డి భాషాను బార్ కౌన్సిల్ నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి బార్ అసోసియేషన్ లో 114 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారని ఇందులో 107 మంది ఓట్లు వేశారని ఆయన తెలియజేశారు. కౌంటింగ్ కార్యక్రమం ఈనెల 16 నుండి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ హాల్ నందు కౌంటింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని కౌంటింగ్ కార్యక్రమం సుమారు 20 రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.