ప్రముఖ పారిశ్రామికవేత్త … జింపెక్స్ అధినేత ఆర్.ఎస్ గోయింకా కన్నుమూత
రైల్వే కోడూరు ప్రజా సీమ
రైల్వే కోడూరు మండలం స్థానిక విద్యానగర్లో కార్యాలయం ఏర్పాటు చేసిన జింటెక్స్ కంపెనీ అధినేత ఆర్ఎస్ గోయింకా బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయన 1970,71 సంవత్సరంలో ముగ్గురాళ్ల వ్యాపారానికై నాటి కడప జిల్లా నేటి తిరుపతి జిల్లా అయిన మంగంపేట ప్రాంతానికి వచ్చారు. అప్పటినుంచి చెన్నైలో ఉన్న జింపెక్స్ కంపెనీని మంగంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో కూడా పెట్టారు. నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డి, సీఎంఆర్ కంపెనీలకు చెందిన సుధాకర్ రెడ్డి, ఐబీసీ కంపెనీలకు చెందిన కందుల ఓబుల్ రెడ్డి, రాజమోహన్ రెడ్డిలతో కలసి అప్పటినుంచి ఇప్పటికీ ముగ్గురాళ్ల వ్యాపారంలో ఐక్యతతోను, పోటీలతోనూ వ్యాపారం చేసి అంచెలంచెలుగా రైల్వే కోడూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జింపెక్స్ కంపెనీని స్థాపించి ముగ్గురాళ్ల వ్యాపారాన్ని పోటా పోటీగా చేస్తూ ఆర్ఎస్ గోయింకా తనదైన శైలిలో వ్యాపారధిత్త్య తన పేరును నిలుపుకున్నారు. ఈయన పేదలను ఆదుకోవడమే కాకుండా అనేక గ్రామాలలోనూ, పట్టణాల లోనూ తన సంస్థ పేరున అధికంగా విరాళాలు ఇచ్చి దేవాలయాలు, బస్ స్టాప్లు వంటి ప్రజా మోలిక వసతులు అనేక సౌకర్యాలను కల్పించి జింటెక్స్ అధినేత గోయింకా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఒక గొప్ప దాత గానే కాకుండా ప్రజల గుండెల్లో దేవుడిలా కూడా నిలిచారన్నది వాస్తవం. ప్రజలనే కాకుండా వ్యాపారస్తులను ఆర్థికంగా ఆదుకొని వారి గుండెల్లో నిలవడమే కాకుండా పల్లెల్లో ను పట్టణాల్లలోనూ ప్రజల అవసరాలకోసం కట్టించిన బడులు, గుడులు, ప్రజా సౌకర్యాలు ఆయనకు చిహ్నలుగానే నిలిచి పోయాయి. చిన్న ఆరోగ్య సమస్య చికిత్స నిమిత్తమై చెన్నై ఆసుపత్రి కి వెళ్లిన అయనకు మంగళవారం రాత్రి బ్రెయిన్ స్టోక్ వచ్చి బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే మంగంపేట, కోడూరు, కడప, తిరుపతి, చెన్నై లకు చెందిన వందలాది మంది ముగ్గురాయి మిల్లుల యజమానులు, పారిశ్రామిక వేత్తలు, పల్లెలు పట్టణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మాచినేని విశ్వేశ్వర రావుతో పాటు హరినాధ రెడ్డి, రమణా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చలపతి మొదలగు వారు చెన్నైకి చేరుకుని వారి మృతికి నివాళులర్పించారు.