రాజంపేట;
టీడీపీ ఇంచార్జి చమర్తి జగన్ మోహన్ రాజు ప్రభుత్వ భూములకు కాపలాదారుగా ఉంటానని చెప్పారని,అలాగే ఇప్పటికే ఆకేపాడు భూముల పై చర్యలు ప్రారంభం అయ్యాయని,అయితే ఈ ఆక్రోశం తట్టుకోలేక వైసీపీ నాయకులు ఊళ్లో పెళ్లికి హడావిడి చేస్తున్నారని,ఇద్దరి వ్యతిగత వ్యవహరం పట్టా భూములకు సంబంధించి ఉన్న వివాదంకు టిడిపి కి ఇంచార్జి కి ఏమి సంబంధం అని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యతిగత వ్యవహారాలలో జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం అంటూ అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీ నాయకుల ది అని,దమ్ముంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని,దోచుకున్న భూములు స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచుతామని,పట్టా రిజిస్ట్రేషన్ భూములలో పార్టీ జోక్యం చేసుకోదని,అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని,అయినా ఇద్దరు టీడీపీ నాయకుల వ్యతిగత వ్యవహారంలో వైసీపీ పాత్ర ఏమిటని,దీనినే ఊళ్ళో పెళ్లికి ఎవరో హడావిడి ఆనే సమేత గుర్తుకొస్తుందని వారు తెలియజేశారు.