prajaseema.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 4:24 pm Digital Edition : PRAJA SEEMA DESK

ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలి

అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు

గాలివీడు ఫిబ్రవరి 22(నేటిపత్రిక ప్రజాసీమ) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు ప్రజలలోకి తీసుకెళ్లాలని అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు.ఆదివారం గాలివీడు పంచాయతీ కేంద్రానికి చెందిన రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ మారువేణి ఆనంద్ కుమార్ ఇచ్చిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లతోపాటు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని, రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నదని కొనియాడారు. ఇలా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని గుర్తుకుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు .