ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం భుజంగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
రైల్వేకోడూరు ప్రజాసీమ
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోవికసిత్ భారత్ సంకల్పమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భుజంగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం టోల్ గేట్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అయూష్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది, తరువాత తమ ప్రియతమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కేక్ కట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం చెంగల్ రాజు పర్యవేక్షణలో, అన్నమయ్య జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి తోట శ్రీనివాసులు , కౌన్సిల్ మెంబర్ వాకచర్ల సుబ్బారావు, పండేటి శంకర్ రాజు, ఓబులవారిపల్లి మండల అధ్యక్షులు ముక్కా రూపేష్ రెడ్డి, చిట్వేల్ మండల అధ్యక్షులు పుల్లగంటి బాపూజీ, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ శ్రీమతి కుప్పాల జ్యోతి, ఆదిలక్షుమ్మ , యువ మోర్చా జిల్లా సెక్రటరీ సాయి ఆచారి, ఎస్సీ మోర్చ విజయ్ కుమార్,మండల పదాధికారులు, వివిధ క్షేత్రాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.