రాజంపేట పట్టణం ( ప్రజా సీమ)
ప్రతి బిజెపి పార్టీ కార్యకర్త పార్టీ సైదాంతిక నిర్మాణాత్మకపార్టీ సిద్ధాంతానికి క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలనీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్
పోతు గుంట రమేష్ నాయుడు తెలియజేశారు.
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి మహాప్రశిక్షణ అభియాన్ లో భాగంగా నేడు ఉదయం రాజంపేట పాత బస్టాండ్ నందు బ్రహ్మంగారిమఠం నందు రాజంపేట పట్టణ కమిటీ సభ్యులతో శిక్షణా తరగతులు ప్రారంభించిన అనంతరం వారికి పార్టీ సిద్ధాంతం పట్ల క్రమశిక్షణ పట్ల పార్టీ కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి వివరించడం జరిగింది. అనంతరం రాజంపేట రూరల్ మండలం సమావేశం రాజంపేటలోని రాంనగర్ నందు వేణుగోపాలస్వామి కళ్యాణ మండపము నందు మండల అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది