prajaseema.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 3:17 pm Digital Edition : PRAJA SEEMA

ప్రజాసేవకు 25 సంవత్సరాలు శ్రీమాన్ నరేంద్ర మోడీ  ( సేవా, సంకల్ప మహా అభియాన్-2026 ) 

ప్రజాసేవకు 25 సంవత్సరాలు శ్రీమాన్ నరేంద్ర మోడీ  ( సేవా, సంకల్ప మహా అభియాన్-2026 )

రైల్వేకోడూరు ప్రజా సీమ
 తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు పట్టణంలోని( శాఖ గ్రంధాలయం ) ను రైల్వే కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది, సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా దేశమే ప్రథమం ఇదే తారక మంత్రం, సాధికారత నుంచి సమృద్ధి వైపు, ప్రజా సేవే పరమావధి, వారసత్వం వికాసం సాంస్కృతిక పునర్జీవ గాధ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలు అను గ్రంధాలతో పాటు మరుగునపడ్డ మహనియుల జీవితచరిత్రకు సంబంధించిన సమాచారం ఉన్న పుస్తకాలు లైబ్రరీలో పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా ఇంఛార్జి తోట శ్రీనివాసులు, యువ మోర్చా జిల్లా సెక్రెటరీ కుంభకోణం సాయి ఆచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పిడుగు సురేంద్ర, మండల జనరల్ సెక్రటరీ కాళప్పగారి రాము, ఉపాధ్యక్షులు శ్రీమతి తోట సుహాసిని, తోట జ్ఞాని , అందరివాడు సుబ్బారావు మరియు లైబ్రరీ మధు పాల్గొనడం జరిగింది.