prajaseema.com
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 3:48 pm Digital Edition : PRAJA SEEMA

పుల్లంపేట తాహసిల్దారు గా మురళీకృష్ణ బాధ్యతలు

పుల్లంపేట (ప్రజాసీమ)

 

పుల్లంపేట నూతన తాహసిల్దారు గా మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సీఎంవో కార్యాలయం నుండి పుల్లంపేట తాహసిల్దారు గా నియమితులయ్యారు. గతంలో ఈయన రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గలలో  మండలాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లంపేట మండలం పై తనకు మంచి అవగాహన ఉందని, తప్పనిసరిగా భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అలాగే రైతులకు ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడంతో పాటు రెవిన్యూ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా వేగంగా సేవలందించేందుకు కృషి చేస్తామని, అలాగే భూకబ్జాలు, ఇతర విషయాలపై ఎటువంటి ఉదాసీనత ఉండదని, తప్పనిసరిగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.