prajaseema.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 2:07 pm Digital Edition : PRAJA SEEMA

పసుపు జెండా మాకు అండ; జ్యోతి గ్రామంలో రెపరెపలాడిన టిడిపి జెండా; కట్టె కాలే వరకు పసుపు జెండాతోనే; మాజీ టీడీపీ మండలాధ్యక్షుడు శనివరపు మోహన్ రెడ్డి

 

సిద్ధవటం (ప్రజా సీమ )

 

పసుపు జెండా మాకు అండ అని, పసుపు జెండా తోనే కట్టె కాలే వరకు ప్రయాణిస్తామని సిద్ధవటం మాజీ మండల టిడిపి అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి తెలియజేశారు.సిద్ధవటం మండలం జ్యోతి గ్రామంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం జెండా ఎగరవేయడం జరిగిందని సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆశయంతో అన్న నందమూరి తారక రామారావు  చేతులు మీదుగా పురుడు పోసుకొని ,ప్రతి తెలుగు వాడిని అభివృద్ధి పదములో నడిపించాలనే లక్ష్యంతో దార్శనికునిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ముందుకు సాగుతున్న తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతికగా తెలుగుదేశం పార్టీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జ్యోతి గ్రామంలో జండా ఎగరవేయడం జరిగిందని వారు తెలిపారు. యువ నాయకులు యువ గళం పాదయాత్ర రథసారథి భావితరాల భవిష్యత్తు నారా లోకేష్ గారు పార్టీని మరి ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ పార్టీ లో సీనియర్ నాయకులను కలుపుకొని వెళుతున్నారని వారు తెలియజేశారు. తమకు రాజకీయాలు తెలిసినప్పటినుండి తెలుగుదేశంలోనే కొనసాగుతున్నామని భవిష్యత్తులో కూడా తెలుగుదేశం బలోపేతానికి గెలుపుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. పసుపు గృహానికి ఎంత మేలు పసుపు జెండా రాష్ట్రానికి అంతే మేలని ఆయన తెలియజేశారు.