పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జడ్పీటీసీ,ఎంపీటీసీలకు ఘన సన్మానo రామిరెడ్డి ధ్వజారెడ్డి
రైల్వే కోడూరు ప్రజా సీమ
ఎంపీపీ సింగమల భవానీ & వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జడ్పీటీసీ,ఎంపీటీసీలకు ఘన సన్మానo
రైల్వే కోడూరు: ఈ రోజు ఉదయం ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ బావని & రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జడ్పీటీసీ,ఎంపీటీసీలను ఘనంగా సన్మానించి, బహుమతులు అందజేసి వారి సేవలను అభినందిస్తూ ఎంపీపీ బావని & *స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.
ప్రజాసేవలో భాగస్వాములైన ఎంపీటీసీల, జడ్పీటీసీ సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయం.
ఐదేళ్ల పదవి కాలంలో సర్పంచులు ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు ప్రజలు నాకు సహకరించినందుకు ధన్యవాదములు.
ఈ కార్యక్రమంలో ఎస్.హరితమ్మ ఎంపీడీవో (ఎఫ్ ఏ సి) , కార్యాలయ సిబ్బంది ,ఎంపీటీసీలు, జడ్పీటీసీ,పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్ లు, మరియు తదితరులు పాల్గొన్నా
రు.