prajaseema.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 5:13 pm Digital Edition : PRAJA SEEMA DESK

న్యాయవాదుల సంఘం ఎన్నికలకు నామినేషన్లు దాఖలు

న్యాయవాదుల సంఘం ఎన్నికలకు నామినేషన్లు దాఖలు


– 28న అసోసియేషన్ ఎన్నికలు
– ఏడు పోస్టులకు 11 నామినేషన్లు
– మహిళలకు30% శాతం రిజర్వేషన్
– ఎన్నికల అధికారి పి రెడ్డయ్య

రాయచోటి  మార్చి16 (ప్రజా సీమ రాయచోటి ప్రతినిధి):
రాయచోటి న్యాయవాదుల సంఘం 2026 -27 సంవత్సరానికి గాను ఈనెల 28న జరగబోయే న్యాయవాదుల సంఘం ఎన్నికల కోసం సోమవారం న్యాయవాదులు 11 నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి పి రెడ్డయ్య తెలియజేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని , పోటీలో నిలబడే వారి ఫైనల్ లిస్ట్ బుధవారం ప్రకటిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళా న్యాయవాదులకు రాయచోటి బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ లో 30% రిజర్వేషన్ కల్పించామని ఆ ప్రకారం రాయచోటి బార్ అసోసియేషన్లో ఉపాధ్యక్షులు ట్రెజరర్,లైబ్రరీ సెక్రెటరీ పదవులకు మహిళలకు రిజర్వేషన్ చేశామని ఎన్నికల అధికారి పి రెడ్డయ్య తెలిపారు. బార్ సోసియేషన్ అధ్యక్ష పదవికి శెట్టిపల్లి ప్రభాకర్ రెడ్డి, వై రమేష్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారని, ఉపాధ్యక్షులుగా ఎస్ లక్ష్మీదేవి, ప్రధాన కార్యదర్శిగా పి రెడ్డి భాషా, ఎం. వెంకటరమణ, ట్రెజరర్ గా కృష్ణుమ, జాయింట్ సెక్రటరీ పదవి కోసం వేల్పుల సిద్దయ్య, వి బాలాజీ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా లైబ్రరీ సెక్రెటరీగా షేక్ మహబూబ్జాన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా టీవీ రమణ, బాలచంద్ర నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలియజేశారు.