prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 5:40 pm Digital Edition : PRAJA SEEMA DESK

నూతన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు

సిద్ధవటం(ప్రజా సీమ)

సిద్ధవటం మండలంలోని భాకరాపేట సమీపాన ఉన్న 11వ పోలీస్ పటాలయంలో వెలసిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో 30 అడుగుల నూతన ధ్వజ స్థంభం ప్రతిష్టించడానికి శుక్రవారం భాకరాపేట గ్రామం నుండి భాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా బెటాలియన్ పోలీసులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండర్ ప్రసాద్ స్థానిక సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు. శ్రీ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో వ్యాపార అభివృద్ధితో రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలతో పాటు అందరూ సుఖశాంతులతో ఉండేలా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరూ పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.