prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 3:30 pm Digital Edition : PRAJA SEEMA DESK

నిత్యపూజ స్వామి కోన లో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

సిద్ధవటం ఫిబ్రవరి 11 నేటిపత్రిక ప్రజాసీమ: ఈనెల 15 న మహా శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా, సిద్ధవటం మండలము, వంతాటిపల్లె గ్రామ శివారు శ్రీలంకమల్ల అభయారణ్యం లో వెలిసిన శ్రీ నిత్య పూజ స్వామి కొనలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రాజంపేట ఏఎస్పీ రామ్ నాథ్ మనోజ్ హెగ్డే తో కలిసి పరిశీలించినారు.భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ ప్లేస్, కోనలో స్వామి దగ్గరికి భక్తులు వెళ్లే మార్గము లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి పోలీస్ అధికారులకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తగు సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. ఎస్పీ గారు శ్రీ నిత్యపూజ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు ఎస్పిని శాలువాతో సత్కరించి, దేవాలయ విశిష్టతను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పి అధికారులను ఆదేశించినారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ గారు, కడప స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీ సుధాకర్, కడప స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు సదాశివయ్య, ఈదుర్ బాషా, ఒంటిమిట్ట సీఐ, నందలూరు ఎస్సై సిద్ధవటం ఎస్సై పాల్గొన్నారు.