పుల్లంపేట (ప్రజా సీమ)
44వ తెలుగుదేశం పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు లో రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి పాల్గొన్నారు.పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట టి.కమ్మపల్లి క్రాస్ రోడ్ లో ఉన్నస్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి
రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కు.డా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి, పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుకాపెర్ల.చంద్రశేఖర్ నాయుడు. ఘన నివాళులర్పించారు. అనంతరం రూపానంద రెడ్డి మాట్లాడుతూ 1983 వ సంవత్సరానికి మునుపు తెలుగు ప్రజలు ఢిల్లీ కి వెళ్లాలంటే భయపడేవారు అలాంటి తరుణంలో తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఉదయించే సూర్యుడువలె బడుగు,బలహీన వర్గాల కోసం కూడు,గూడు,గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని,తెలుగు జాతిని ప్రపంచానికి చాటిచెప్పి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినపథకాలు వైపు ప్రపంచం ఎదురుచూసేలా చేస్తున్నారనితెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఆరే సుధాకర్ నాయుడు,పోలూరు కృష్ణమ నాయుడు,జనరల్ సెక్రెటరీ పోలి జగదీశ్వర్ రెడ్డి,కాపెర్ల వెంకట నారాయణ, సాయికుమార్, సుధీర్ గొర్లమనోజ్,ముమ్మినేనిసుబ్రహ్మణ్యంపోలినేని వెంకటేశ్వర్లు,నేలపాటి శివయ్య,కుప్పాలరామకృష్ణయ్య,శివశంకర్, కొండేటి చంగయ్య, కేసినేనినారాయణ నాయుడు, సింగం ఆదినారాయణ రెడ్డి,బీముశేఖర్ రెడ్డి,నర్సాపురం శివాజీ, ఫోలుప్రేమకుమార్,సుబ్బన్న,
భానుప్రకాష్, కొర్నూతల సుబ్రహ్మణ్యం,కిషోర్,నూకల శరణం, జంధ్యం సుబ్రహ్మణ్యం, బోడా వెంకటరమణ,రామచంద్ర రెడ్డి,శంకర్ రెడ్డి,శివయ్య,కావుటూరినాగేశ్వరరావు, శ్రీనివాసులు, సుబ్బరాయుడు,శంకర్ రాజు, పల్లెపుజనార్ధన,జి.కే.సుబ్బారెడ్డి, అనపాలచంద్ర,పసుపులేటివెంకటరమణ,సింగమాల రామ్మూర్తి,ఇందుకూరి రామ్మూర్తి, రెడ్డి పాక మల్లికార్జున,గోపదాల శ్రీనివాసులు,అనంతంపల్లి పంచాయతి తెలుగు మహిళ సౌభాగ్యవతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.