prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 4:39 pm Digital Edition : PRAJA SEEMA DESK

తాలూకా ఎస్సైలను సన్మానించిన బేడా,బుడగజంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధూపం రాజు

కడప, ఫిబ్రవరి 11 ప్రజాసీమ:- కడప నగర తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్సైలు జె.మోహన్ కుమార్ గౌడ్,మొహమ్మద్ రఫీ లను బుధవారం నగరంలోని 48 డివిజన్,బుడగ కాలనీకి చెందిన బేడా,బుడగజంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధూపం రాజు మర్యాదపూర్వకగా కలిశారు. ఎస్.ఐ.లకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సంధర్భంగా ధూపం రాజు మాట్లాడుతూ ఇద్దరు సబ్ ఇన్ఫెస్టర్ల పదవీ కాలం విజయవంతంగా,సమర్థవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని విన్నవించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ వ్యవస్థపై ఇంకా నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. తమ 48 వ డివిజన్ పరిధిలో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు, పేదలు ఉన్నారని వారందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ అధికారులుగా పేరున్న ఇద్దరు ఎస్.ఐ.లు సామాన్య,మధ్యతరగతి ప్రజలకు తప్పనిసరిగా న్యాయం అందిస్తారని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేడా, బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు ధూపం మహేష్,పి.సురేష్,రాజేష్ పాల్గొన్నారు.