*తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాజంపేట పార్లమెంట్ సభ్యు లు శ్రీ పి.వి మిథున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు*
రైల్వేకోడూరు ప్రజా సీమ
*జననేతకు జయహో మంగంపేటలో అట్టహాసంగా శ్రీ ఎంపీ పి వి మిథున్ రెడ్డి జన్మదినోత్సవం శ్రీ కట్టా పుట్టాలమ్మ సన్నిధిలో పూజలు.. ఉచిత రక్తదానం, చీరల పంపిణీ
రైల్వేకోడూరు ప్రగతికి బాటలు వేసిన ప్రజా నాయకుడు సాయంలో మేటి.. ప్రతి గుండెకూ శ్రేయోభిలాషి ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వానికి ప్రతిరూపం, ప్రజల గుండె చప్పుడు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి*
ఓబులవారిపల్లె మండలం మంగంపేట పంచాయతీ వైఎస్సార్సీపీ వర్ణశోభితమైంది. వైసిపి రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షులు, డిఆర్ యుసిసి సభ్యులు *తల్లెం భరత్ కుమార్ రెడ్డి* ఆధ్వర్యంలో ఈ శుభవేడుకలు పండగలా సాగాయి.
ప్రభాత సమయాన్నే శ్రీ కట్టా పుట్టాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ప్రియతమ నేత రాజంపేట పార్లమెంటు సభ్యులు *శ్రీ పి.వి మిథున్ రెడ్డి గారు* ఆయురారోగ్యాలతో, ఉన్నత పదవులతో నూరేళ్లూ వర్ధిల్లాలని ఆధ్యాత్మిక నీరాజనాలు అర్పించారు. అంతే కాకుండా పూజలు అనంతరం అనంతరం విచ్చేసిన భక్తులకు,ప్రజలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.మంగంపేట బైపాస్ వద్ద కార్యకర్తల ఉత్సాహాల నడుమ భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షల తోరణాలు విరియపూయించారు. కేవలం సంబరాలకే పరిమితం కాక, ప్రాణదానంతో సమానమైన ఉచిత రక్తదాన శిబిరం, మాతృమూర్తులకు ప్రేమపూర్వకంగా ఉచిత చీరల పంపిణీ చేపట్టి సేవలోనూ స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా *తల్లెం భరత్ కుమార్ రెడ్డి* మాట్లాడుతూ “సామాన్య కార్యకర్తను సైతం గుర్తించి ఉన్నత స్థానాన నిలిపే మహోన్నత వ్యక్తిత్వం మిథున్ రెడ్డి గారిది” అని ప్రశంసించారు. 2014 నుండి నేటివరకు రాజంపేట లోక్‌సభ వేదికగా, రైల్వేకోడూరు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తూ… అండర్ బ్రిడ్జ్‌లు, విశాల జాతీయ రహదారులు, స్వచ్ఛమైన మినరల్ వాటర్ ప్లాంట్లు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపే ఉచిత మోటార్ బైక్‌లు, పాస్‌ల పంపిణీతో అభివృద్ధి ప్రవాహాన్ని పారించారు. విదేశాల్లో కన్నుమూసిన దిక్కులేని ప్రాణాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యంతో సొంత నిధులతోనే కడసారి ప్రయాణాన్ని చేర్చిన కరుణామయుడు ఆయన అని కొనియాడారు.స్థానిక నేతలు, ఉత్సాహవంతమైన యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు మరియు మహిళలు విశేషంగా తరలివచ్చి, తమ ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డికి ఆత్మీయ జన్మదిన మంగళశాసనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటసుబ్బయ్య ఓరుగంట అనిల్ స్వామి రెడ్డి అద్దె వెంకటేశు మొగుల్ మొగిలి నవీను చంటి సుబ్రహ్మణ్యం రమణ వెంకటేశు రాజ్యము ఇర్ఫాను శీను బాలసుబ్రమణ్యం ప్రకాష్ సుంకమ్మ వెంకటమ్మ మణెమ్మ వెంకటసుబ్బయ్య సుబ్బరాయుడు తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు