prajaseema.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:43 pm Digital Edition : PRAJA SEEMA

తడి–పొడి చెత్తను వేరు చేయాలి వి.పి.ఆర్. కండ్రిక ఎస్‌డబ్ల్యూపీ షెడ్‌లో పరిశీలన

తడి–పొడి చెత్తను వేరు చేయాలి వి.పి.ఆర్. కండ్రిక ఎస్‌డబ్ల్యూపీ షెడ్‌లో పరిశీలన

రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు మండలం వి.పి.ఆర్. కండ్రిక గ్రామ పంచాయతీలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ (ఎస్‌డబ్ల్యూపీ) షెడ్‌ను మంగళవారం సందర్శించి, అక్కడ చేపడుతున్న తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పంచాయతీలో చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. తడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, పొడి చెత్తను ప్రత్యేకంగా సేకరించి డ్రై వేస్ట్ కేంద్రానికి అందించాలని సూచించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లకు పలు సూచనలు చేశారు. ఇదే విధానాన్ని తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో కూడా అమలు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు. ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.